Skip to main content

Namaste NRI

ప్రధాని మోదీని కలిసిన మమత బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఢల్లీి పర్యటనలో ఉన్న ఆమె 7 లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లో ఉన్న మోదీ నివాసానికి వెళ్లారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఇద్దరూ ఢల్లీిలో తొలిసారి కలుసుకున్నారు. రాష్ట్రానికి బాకీ ఉన్న నిధులను విడుదల చేయాలని మమతా కోరినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ వ్యాక్సిన్లను కూడా అధిక మొత్తంలో రిలీజ్‌ చేయాలని ఆమె అభ్యర్థించారు. యశ్‌ తుఫాన్‌ సమీక్ష స్వల్ప వ్యవధి పాటు మే నెలలో ఇద్దరూ మాట్లాడుకున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర పేరును మార్చాలన్న పెండిరగ్‌ అంశాన్ని కూడా మోదీతో గుర్తు చేస్తున్నట్లు దీదీ తెలిపారు. దీని గురించి ఆలోచిస్తామని మోదీ చెప్పినట్లు ఆమె వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News