Skip to main content

Namaste NRI

మనోజ్ బాజ్‌పేయి గవర్నర్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

బాలీవుడ్ న‌టుడు మనోజ్ బాజ్‌పేయి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం గవర్నర్: ద సైలెంట్ సేవియర్. ఈ సినిమాకు చిన్మయ్ దీపక్ మాండ్లేకర్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండ‌గా ప్ర‌ముఖ నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మనోజ్ బాజ్‌పేయి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. నేడు భారతదేశం ప్రపంచ వేదికపై ఒక శక్తివంతమైన దేశంగా వెలుగొందుతోంది అంటే, దాని వెనుక ఒక అజ్ఞాత వీరుడు ప్రాణాలకు తెగించి చేసిన అలుపెరుగని పోరాటం. చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఆ అద్భుత యోధుడి గాథను వెండితెరపై ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రమే గవర్నర్: ద సైలెంట్ సేవియర్ అంటూ చిత్ర‌బృందం ఈ పోస్ట‌ర్‌ను పంచుకుంది.

మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అదా శర్మ, మధు, నోషాద్ మహమ్మద్ కుంజు, పరితోష్ సాండ్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది స్వరాలు సమకూరుస్తుండగా, దిగ్గజ కవి జావేద్ అక్తర్ సాహిత్యాన్ని అందిస్తున్నారు. సన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్ లాల్ షా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం స‌మ్మ‌ర్ కానుక‌గా జూన్‌12 న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events