Skip to main content

Namaste NRI

వరుణ్‌తేజ్‌ అతిథిగా మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా ప్రీరిలీజ్‌

అభినవ్‌ గోమఠం, వైశాలిరాజ్‌ జంటగా నటిస్తున్న చిత్రం మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా. తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. కాసుల క్రియేటివ్‌ వర్క్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకానుంది. ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. యువ హీరో వరుణ్‌తేజ్‌ ముఖ్య అతిథిగా హాజరై బిగ్‌ టికెట్‌ను విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమెడియన్‌గా అభినవ్‌ తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్నాడు. చక్క టి కంటెంట్‌తో ఈ సినిమా చేశారు అన్నారు. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనదని, ఎన్నో ఒడిదు డుకుల్ని ఎదుర్కొని పూర్తిచేశామని, కథలోని కొత్తదనం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అభిన వ్‌ గోమఠం చెప్పారు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర గుర్తుండిపోతుందని నిర్మాతలు ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌ వి పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events