Skip to main content

Namaste NRI

అక్టోబరులో మిస్సింగ్

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మిస్సింగ్‌. భాస్కర్‌ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. మిస్సింగ్‌ చిత్రంలో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 22న థియేటర్లలో విడుదల చేయనున్నారు.  ఈ సందర్భంగా నిర్మాతలు భాస్కర్‌ జోస్యుల, లక్ష్మీ శేష గిరిరావు మాట్లాడుతూ మిస్సింగ్‌ ఒక మిస్టరీ థ్రిల్లర్‌ సినిమా. ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తి కలిగిస్తుంది. లాక్‌ డౌన్‌లో పట్టుదలగా సినిమాను పూర్తి చేశాం. అక్టోబర్‌ 22న మా చిత్రాన్ని థియేటర్‌ల ద్వారా మీ ముందుకు తీసుకు రాబోతున్నాం అన్నారు. దర్శకుడు జోస్యుల మాట్లాడుతూ ఒక థ్రిల్లర్‌ జానర్‌ సినిమా చేయాలనే కోరికతో ఈ కథని అనుకున్నాం. థియేటర్‌లో సినిమా ఉండాలనేది మా  కోరిక. టీమ్‌  అందరం అక్టోబర్‌ 22న తేదీ కొరకు ఎదురు చూస్తున్నాం అన్నారు.

Social Share Spread Message

Latest News