Namaste NRI

మిస్టర్‌ బచ్చన్‌ రొమాంటిక్‌ మెలోడీ రిలీజ్ అప్‌డేట్‌‌

Mayfair 4

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. హరీష్‌శంకర్‌ దర్శకుడు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఈ సినిమాలోని రొమాంటిక్‌ మెలోడీ సాంగ్‌ జిక్కీ ఈ నెల 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా  కొత్తపోస్టర్‌ను విడుదల చేశారు. మిక్కీ జే మేయర్‌ స్వరపరచిన ఈ పాట మెలోడియస్‌ రొమాంటిక్‌ నెంబర్‌గా సంగీతప్రియుల్ని మెప్పిస్తుందని, నాయకానాయికలు రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్‌ అభిమానిగా రవితేజ కనిపించనున్నారు. మాస్‌, కామెడీ, యాక్షన్‌ అంశాల కలబోతగా దర్శకుడు హరీష్‌శంకర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని మేకర్స్‌ తెలిపారు. జగపతిబాబు, సచిన్‌ ఖేడేకర్‌ నటిస్తున్నారు. ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్‌, సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్‌.

Ixora 4
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events