Skip to main content

Namaste NRI

బ్రిస్బేన్‌ బోనాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లోని గాయత్రి మందిర్‌లో భారత జాగృతి ఆధ్వర్యంలో బోనాల వేడుకలను నిర్వహించనున్నారు. ఈ బోనాల పండుగకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిస్బేన్‌లోని ప్రవాసీలకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత జాగృతి ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమం జులై 15న ఉదయం 10 గంటలకు బ్రిస్బేన్‌ గాయత్రి మందిర్‌లో ప్రారంభం కానున్నాయి. కార్యక్రమానికి తెలంగాణ అసోసియేషన్, క్వీన్స్ ల్యాండ్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ అఫ్ గోల్డ్ కోస్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా మద్దతు తెలిపాయి.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, యువజన విభాగం అధ్యక్షుడు కోరబోయిన విజయ్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను, లీగల్ సెల్ కన్వీనర్ తిరుపతి వర్మ, రాష్ట్ర కార్యదర్శి విక్రాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News