Skip to main content

Namaste NRI

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయానికి మోదీ శంకుస్థాపన

ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు శ్రీకారం చుట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్‌ జిల్లా జెవెర్‌ ప్రాంతంలో నిర్మించనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితరులు హాజరయ్యారు.  1300 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తోన్న ఈ నిర్మాణం పూర్తయితే ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు ఇదే కానుంది.

                తొలి దశలో రూ.10,050 కోట్లతో దీని పనులు చేపట్టారు. 2024 సెప్టెంబరు / అక్టోబరు నాటికి ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని యూపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఏడాదికి 1.2 కోట్ల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యమిస్తూ అత్యాధునిక హంగులతో ఎయిర్‌పోర్టును రూపుదిద్దనున్నారు. ఢల్లీి, ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఇది రెండో అంతర్జాతీయ విమానశ్రయం కాగా ఉత్తరప్రదేశ్‌లో ఐదోది. దేశంలోనే ఐదు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులున్న ఏకైక రాష్ట్రంగా యూపీ నిలవనుంది. కాగా వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలలో విమానాశ్రయం ఒకటి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events