Namaste NRI

మిస్టర్‌ బచ్చన్‌ కొత్త సాంగ్‌ వచ్చేసింది

50e409c6 592a 4e9f 922f 2a94141522d8 8

రవితేజ కథానాయకుడిగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. భాగ్యశ్రీబోర్సే, జగపతిబాబు, సచిన్‌ఖేడేకర్‌, సత్య తదితరులు నటించారు.రిలీజ్‌ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచార పర్వంలో జోరు పెంచారు. మూడోగీతం జిక్కి విడుదలైంది. మెలోడీ ప్రధానంగా స్వరకర్త మిక్కీ జే మేయర్‌ ఈ పాటను తీర్చిదిద్దారు.అటు కాశ్మీర్‌ అందాలూ, ఇటు నాయకానాయికల కెమిస్ట్రీ రెండూ ఆకట్టుకునేలా ఉన్నాయి. నిన్ను చూసి గుండె ఒట్టు పెట్టుకున్నదే.. గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే.. పట్టుబట్టి పూల చేయి పట్టుకున్నదే.. అగ్గిరాజేశాక ఆగేదెట్లాగే అంటూ చక్కటి ప్రణయభావాలతో ఈ పాట సాగింది. వనమాలి రాసిన ఈ పాటను కార్తీక్‌, రమ్య బెహరా ఆలపించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని మేకర్స్‌ ప్రకటించారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్‌, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌, రచన-దర్శకత్వం: హరీశ్‌శంకర్‌.

f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 8
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events