చిమటా రమేశ్‌బాబు స్వీయ దర్శకత్వంలో నటించి చిత్రం నేను కీర్తన. రిషిత, మేఘన హీరోయిన్లు. చిమటా లక్ష్మీకుమారి నిర్మాత. ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాతల మండలి ప్రధాన కార్య దర్శి టి.ప్రసన్నకుమార్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, రజాకార్ సినిమా దర్శకుడు యాటా సత్యనారాయణ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో దర్శకుడిగా, హీరోగా బాధ్యతల్ని నిర్వర్తించానని, బ్లాక్‌బాస్టర్‌గా నిలిచే చిన్న చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా నిలుస్తుందని, పాటలు, పోరాటాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిమటా రమేశ్‌బాబు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యలుం దరూ మాట్లాడారు. త్వరలో సినిమా విడుదల కానుంది. సంధ్య, జీవా, విజయరంగరాజు, జబర్దస్త్ అప్పారావు, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కె.రమణ, సంగీతం: ఎం.ఎల్.రాజా.