Skip to main content

Namaste NRI

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే

జాతీయ ఉత్తమ నటులుగా మమ్ముట్టి,
కార్తిక్ ఆర్యన్ జాతీయ ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370
ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియాసామి
జాతీయ ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా కల్కి 2898 ఏడీ
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరంలో విడుదలైన వైవిధ్యభరితమైన 400లకు పైగా చిత్రాలు జ్యూరీ ముందుకు రాగా, వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ అవార్డులను అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ సౌత్ ఫిల్మ్‌మేకర్ జయరాజ్ జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఈ అవార్డులలో జాతీయ ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370 (హిందీ) నిలిచింది.

జాతీయ ఉత్తమ నటుడిగా మమ్ముట్టి (భ్రమయుగం), కార్తిక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్) సంయుక్తంగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా యామి గౌతమ్ (ఆర్టికల్ 370), ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియాసామి (అమరన్)లను జాతీయ అవార్డులు వరించాయి. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు ఈ అవార్డుకు ఎంపికైంది. జాతీయ ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా కల్కి 2898 ఏడీ (దర్శకుడు నాగ్ అశ్విన్), ఉత్తమ బాలల చిత్రంగా చిన్న కథ కాదు (దర్శకుడు నందకిషోర్) అవార్డులు దక్కాయి. ఉత్తమ మేకప్ పి.రవికుమార్ (కమిటీ కుర్రోళ్లు), ఉత్తమ కాస్టూమ్ డిజైనర్‌గా దీపాలి నూర్, శీతల్ శర్మ (పుష్ప 2) , ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్‌గా నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ), ఉత్తమ స్క్రీన్‌ప్లే (సంభాషణలు) వెంకీ అట్లూర్ (లక్కీ భాస్కర్), ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత (ఒరిజినల్) సుకుమార్- (పుష్ప 2)లను ఈ అవార్డులు వరించాయి.

జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..
ఉత్తమ చిత్రం : ఆర్టికల్‌ 370 (హిందీ)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: కల్కి 2898ఏడీ (తెలుగు)
ప్రాతీయ ఉత్తమ తెలుగు చిత్రం : కమిటీకుర్రోళ్లు
ఉత్తమ బాలాల చిత్రం : 35-చిన్నకథ కాదు (తెలుగు)
ఉత్తమ నటుడు: మమ్ముట్టి(భ్రమయుగం), కార్తిక్‌ ఆర్యాన్‌ (చందూ ఛాంపియన్‌)
ఉత్తమ నటి: యామి గౌతమ్‌ (ఆర్టికల్‌ 370)
ఉత్తమ దర్శకత్వం: రాజ్‌కుమార్‌ పెరియసామి (అమరన్‌)
ఉత్తమ సహాయ నటి: సచన సమిదాస్‌ (మహారాజ)
ఉత్తమ సహాయ నటుడు: సంజయ్‌ మిశ్రా (భక్షక్‌)
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు :
రణ్‌దీప్‌ హుడా (స్వాతంత్య్ర వీర్‌ సావార్కర్‌)
ఉత్తమ కథనం: సుకుమార్‌ (పుష్ప 2) (తెలుగు)
ఉత్తమ సంభాషణలు: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌) (తెలుగు)
ఉత్తమ నేపథ్య సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌ (అమరన్‌)
ఉత్తమ సంగీతం (పాటలు) : శశ్వాంత్‌ సచ్‌దేవ్‌ (ఆర్టికల్‌ 370)
ఉత్తమ మేకప్‌ : పి.రవికుమార్‌ (కమిటీ కుర్రోళ్లు) (తెలుగు)
ఉత్తమ బాలనటుడు : అరుణ్‌దేవ్‌ పోతుల
(35-చిన్నకథకాదు) (తెలుగు)

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events