Namaste NRI

నికోలస్ మడురోకు వ్యతిరేకంగా..దేశవ్యాప్తంగా  ఆందోళనలు

Mayfair 1

వెనిజులా దేశాధ్యక్షుడిగా మళ్లీ నికోలస్ మడురో విజయం సాధించడంతో,  ఆ ఎన్నికను వ్యతిరేకిస్తూ ప్రజలు దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు చేపట్టారు. గత నాలుగు రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు వారిపై టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తు న్నారు. ఈ ఘటనల్లో ఇప్పటిరకు 11 మంది ఆందోళనకారులు మరణించారు. దేశ రాజధాని సెంట్రల్ కరాకాస్లో వేల మంది ప్రదర్శన చేపట్టారు. మురికి వాడల నుంచి, పర్వత ప్రాంతాల నుంచి కూడా జనం కొన్ని మైళ్ల దూరం జనం నడిచివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మార్గంలో ర్యాలీ తీశారు. ఎన్నికల్లో గెలిచినట్లు మాడురో ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు దిగారు. ఫలితాల్లో మోసం జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి.

Ixora 1
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events