Skip to main content

Namaste NRI

వరల్డ్‌వైడ్‌గా నేనేనా రిలీజ్‌కు రెడీ

రెజీనా కసాండ్రా  ప్రస్తుతం ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ లో సూర్పనగై అనే సినిమాను చేస్తుంది. తెలుగులో నేనేనా పేరుతో రిలీజ్‌ చేయనున్నారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ , అలీ ఖాన్ , జై ప్రకాష్ వంటి కీలక నటులు నటిస్తున్నారు. శ్యామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. జాంబిరెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ పై ఈ చిత్రం తెరకెక్కింది. కాగా, అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి క్లీన్ U/A సర్టిఫికేట్ ను సెన్సార్ సభ్యులు ఇచ్చారు. సినిమా విభిన్నంగా ఉందని, మంచి కంటెంట్‌తో వస్తుంది అంటూ మూవీ యూనిట్‌ని సెన్సార్ సభ్యులు అభినందించారు.

Social Share Spread Message

Latest News