Skip to main content

Namaste NRI

తెలంగాణ బీసీ కమిషన్ కు కొత్త చైర్మన్

తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌గా డాక్టర్‌ వకుళాభరణం కృష్ణ మోహన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిషన్‌కు సభ్య కార్యదర్శిగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సీహెచ్‌ ఉపేంద్ర, శుభప్రద్‌ పటేల్‌ నూలి, కే కిషోర్‌ గౌడ్‌లను సభ్యులుగా నియమించారు. చైర్మన్‌గా నియమితులైన వకుళాభరణం, సభ్యులుగా నియమితులైన శుభప్రద్‌ పటేల్‌, కే.కిశోర్‌ గౌడ్‌, సీహెచ్‌ ఉపేంద్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అవతరణ తర్వాత తొలి బీసీ కమిషన్‌లో సభ్యులుగా వకుళాభరణం సేవలందించిన సంగతి తెలిసిందే.

Social Share Spread Message

Latest News