Namaste NRI

లండన్‌లో ఎన్నారైలు సంబురాలు

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎమ్మెల్సీ  కవితకు బెయిల్‌ మంజూరు కావడంతో లండన్‌లో ఎన్నారైలు సంబురా లు జరుపుకున్నారు. ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారని వారు విమర్శిం చా రు. రాజకీయ కుట్రతో పెట్టిన కేసులో చివరకు న్యాయమే గెలిచిందని, కవితకు బెయిల్‌ ఇవ్వడంపట్ల సుప్రీం కోర్టు కు ఎన్నారై బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ధన్యవాదాలు తెలిపా రు.

Ixora 139

బెయిల్ వచ్చిన విధంగానే తుది తీర్పులో కూడా కడిగిన ముత్యంలా కవితబయటకు వస్తుందన్నా రు. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసులని, అయినా ఒక బాధ్యతగల దేశ పౌరురాలిగా న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉంచి అన్ని రకాల విచారణలకు కవిత సహకరించారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో ఎన్నారై బీఆర్‌ఎస్‌ నాయకులు రత్నాకర్ కడుదుల, రవి రేటినేని, సత్య చిలుముల, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mayfair 138
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events