Skip to main content

Namaste NRI

జపాన్‌ భూకంపం ఘటనపై ఎన్టీఆర్‌ దిగ్భ్రాంతి

జపాన్‌లో వరుస భూకంపాల ఘటనపై టాలీవుడ్‌ స్టార్‌ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తాజాగా స్పందించారు. ఈ మేరకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఎన్టీఆర్‌ గతవారం కుటుంబంతో కలిసి వెకేషన్‌ కోసం జపాన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. వ్యక్తిగత పర్యటన నిమిత్తం తారక్‌ జపాన్‌లో వారం రోజులపాటు గడిపారు. ఇక టూర్‌ ముగించుకొని సోమవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇంతలోనే అక్కడ వరుస భూకంపాలు సంభవించాయన్న విషయం తెలుసుకున్న ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. జపాన్‌ నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చాను. గతవారం అంతా అక్కడే గడిపాను. జపాన్‌లో భూకంపం వార్త విని షాక్‌ అయ్యాను. ఆ ప్రాంతంలో భూకంపం రావడం నా హృదయాన్ని కలచివేసింది. అక్కడి ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

Social Share Spread Message

Latest News