Skip to main content

Namaste NRI

ఎన్టీఆర్‌ – ప్రశాంత్ నీల్ షూటింగ్‌ షురూ 

ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్‌ ఇండియా యాక్షన్‌ మూవీ హైదరాబాద్‌ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నా యి. ఎన్టీఆర్‌ నీల్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనుంది.  చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్ని ఉన్నాయని, వాటన్నింటిని అందుకునేలా అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని, ఎన్టీఆర్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి డ్రాగన్‌ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: భువన్‌గౌడ, సంగీతం: రవి బస్రూర్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: చలపతి, నిర్మాతలు: నంద మూరి కల్యాణ్‌రామ్‌, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు, రచన-దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌.

Social Share Spread Message

Latest News