Skip to main content

Namaste NRI

జాన్వీతో ఎన్టీఆర్ రొమాన్స్‌ .. దేవర మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్నచిత్రం దేవర. జాన్వీకపూర్‌ కథానాయిక.  ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ పతాకాలపై సుధాకర్‌, హరికృష్ణ కె. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో  సైఫ్‌అలీఖాన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.  విస్మరణ కు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ వెలువడింది. మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా రెండో గీతాన్ని ఈ నెల 5న విడుదల చేయబోతున్నారు. ఈ పాట తాలూకు పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అనిరుధ్‌ సంగీతాన్నంది స్తున్న ఈ పాట రొమాంటిక్‌ మెలొడీగా ఆకట్టుకుంటుందని, ఎన్టీఆర్‌ నృత్యాలు, జాన్వీకపూర్‌ అందచందాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని మేకర్స్‌ తెలిపారు. దేవర పార్ట్‌-1 సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events