Namaste NRI

బోనాల సందర్భంగా ఓదెల 2 కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల

తమన్నా  ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. అశోక్‌తేజ దర్శకుడు. ముధు క్రియేషన్స్‌, సంపత్‌ నంది టీమ్‌వర్క్స్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండటం విశేషం. ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌, వశిష్ట ఎన్‌.సింహ, యువ, నాగమహేశ్‌ ఇతర పాత్రధారులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతున్నది. అక్కడ ప్రత్యేకంగా నిర్మించిన ఓదెల మల్లన్న టెంపుల్‌ సెట్‌లో ైక్లెమాక్స్‌ని చిత్రీకరిస్తున్నారు. తమన్నా, ఇతర నటీనటులతో పాటు 800మంది జూనియర్‌ ఆర్టిస్టులు ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

50e409c6 592a 4e9f 922f 2a94141522d8 141

సినిమాకు ఈ ఎపిసోడ్‌ అత్యంత కీలకమని, అందుకే ఖర్చుకు వెనుకాడటం లేదని మేకర్స్‌ తెలిపారు. బోనాల పండుగ నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌ ఉంటుందని, బోనాల టైమ్‌లోనే ఈ షూటింగ్‌ జరగడం కోఇన్సిడెంట్‌ అని దర్శకుడు చెప్పారు. ఈ సందర్భంగా చీరకట్టుకొని, తలపై బోనం మోస్తూ ఉన్న తమన్నా పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. దర్శకుడు సంపత్‌నంది గైడెన్స్‌తో ప్రతిష్టాత్మకంగా అశోక్‌తేజ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్‌.ఎస్‌, సంగీతం: అజనీశ్‌ లోకనాథ్‌.

f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 150
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events