ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డితో కలిసి నిర్మాత చైతన్యరెడ్డి నిర్మించిన చిత్రం డార్లింగ్. అశ్విన్‌రామ్ దర్శకత్వం. ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చైతన్యరెడ్డి విలేకరులతో ముచ్చటించారు. చాలాకాలంగా సినిమా మా జీవితంలో భాగం అయిపోయింది. ఇప్పుడు అదే ఫీల్డ్‌లో వర్క్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. నిజానికి సినిమాతో పోలిస్తే బిజినెస్‌నే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. నేను బిజినెస్‌లో క్వాలిఫైడ్. దానిపై మాస్టర్స్ చేశాను. అటు సినిమా, ఇటు బిజినెస్ ఇలా రెండు రంగాల్లోనూ సక్సెస్‌లు చూస్తుండటం గర్వంగా ఉంది. ఈ క్రెడిబిలిటీ అంతా మా పేరెంట్స్‌దే అంటున్నారు. హను-మాన్ లాంటి పెద్ద సక్సెస్ తర్వాత మా సంస్థనుంచి వస్తున్న సినిమా ఇది. పెళ్లికి ముందు, పెళ్లి అయ్యాక, పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత జీవితాల్లో వచ్చే మార్పుల నేపథ్యంలో సాగే ఈ కథ మా అందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది.

రేపు సినిమా చూశాక ఆడియన్స్ కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారు. ఆ నమ్మకంతోనే సినిమా చేశాం. ఫన్ ఎలిమెంట్స్‌తో కూడిన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ఇది అని చైతన్యరెడ్డి తెలిపారు. మొదట ఈ సినిమా కు వైదిస్ కొలవరి అనే టైటిల్ అనుకున్నామని, అందరికీ అర్థం కాదనే ఉద్దేశంతో డార్లింగ్ అనే టైటిల్ పెట్టి, వైదిస్ కొలవరి అనేది ట్యాక్‌లైన్‌గా ఫిక్స్ చేశామని, నభానటేశ్, ప్రియదర్శి ఇద్దరికీ ఇందులోని పాత్రలు పర్‌ఫెక్ట్ గా సెట్టయ్యాయని, అద్భుతంగా నటించారని చైతన్యరెడ్డి పేర్కొన్నారు. జై హనుమాన్ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. హను-మాన్ ని మించేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారనేది ఆ హనుమంతుడే డిసైడ్ చేస్తారు అని చైతన్యరెడ్డి చెప్పారు.
