Skip to main content

Namaste NRI

లెవిస్‌ యూనివర్సిటీలో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు  

అమెరికాలోని షికాగోలో ఉన్న లెవీస్‌ యూనివర్సిటీలో తెలుగు తేజాలు సత్తా చాటారు. యూనివర్సిటీలో ఆధ్వర్యంలో నిర్వహించిన స్టార్టప్‌ ఐడియా పోటీల్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆరుగురు ఫైనల్స్‌కు చేరుకోగా, వారిలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొణిజేడుకు చెందిన షమ్మి సాయిచరణ్‌, రామా చైతన్య, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన హష్మీ విజేతలుగా నిలిచారు.  

ఈ సందర్భంగా ప్యానల్‌లోని న్యాయనిర్ణేతలు మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది విద్యార్థుల ఆలోచనకు మద్దతు తెలిపారని చెప్పారు. విద్యార్థుల ప్రజెంటేషన్‌, కంటెంట్‌, ఐడియా చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. విజేతలకు 2 వేల డాలర్ల చెక్‌కు అందజేశారు. యూనివర్సిటీకి చెందిన పలువురు ప్రముఖులు మాట్లాడుతూ  షమ్మి చరణ్‌, రామచైతన్య, హష్మీల కృషి, పట్టుదల భావితరాలకు ఎంతో ఆదర్శమని ప్రశంసించారు. తమ సహాయ సహకారాలు వారికి ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డును దక్కించుకున్న తెలుగు విద్యార్థులను పలువురు అభినందించారు. 

Social Share Spread Message

Latest News