చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం పారిజాత పర్వం. కిడ్నాప్ ఈజ్ ఆన్ ఆర్ట్ ఉపశీర్షిక. సంతోష్ కంభంపాటి దర్శకత్వం. మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించారు. ప్రీరిలీ జ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన కిడ్నాప్ డ్రామా ఇది. ఆద్యంతం వినోదంతో పాటు ఉత్కంఠను పంచుతుంది అన్నారు. ఇది పూర్తిగా కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. దీనికి సీక్వెల్ కూడా ఉంది అని హీరో చైతన్య రావు తెలిపారు. వినూత్నమైన కాన్సెప్ట్ ఇదని నిర్మాత మహీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: బాల సరస్వతి, సంగీతం: రీ, రచన-దర్శకత్వం: సంతోష్ కంభంపాటి.