వినోద్ కిషన్, అనూషకృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం పేకమేడలు. ఈ చిత్రానికి దర్శకుడు నీలగిరి మామిళ్ల, నిర్మాత రాకేశ్ వర్రే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిళితం చేసి ఈ సినిమా చేశామని దర్శకుడు తెలిపారు. ఇది కేవలం కామెడీ సినిమానే కాదని, జీవితంలో మగవారికి ఆడవాళ్లు ఇస్తున్న సహకారాన్ని ఈ కథ ద్వారా చర్చించడం జరిగిందని నిర్మాత చెప్పారు.
ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల హీరోహీరోయిన్లు ఆనందం వెలిబుచ్చారు. రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేశ్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: హరిచరణ్ కె., సంగీతం: స్మరణ్ సాయి, నిర్మాణం: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్.