Namaste NRI

ఘనంగా శరపంజరం ప్రీ రిలీజ్‌ వేడుక

నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం శరపంజరం. లయ కథానాయిక. ఈ సందర్బంగా ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించి, ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. జీరో బడ్జెట్‌లో, కేవలం స్నేహితుల సహకారంతో మొదలుపెట్టిన ఈ యజ్ఞం ఇప్పుడు విడుదల కు వచ్చిందంటే మేం విజయం సాధించినట్టే లెక్క. ఈ సినిమా నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నాను అని నవీన్‌కుమార్‌ గట్టు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్‌ సభ్యులతోపాటు, ఆహ్వానితులు కూడా సినిమా విజయం సాధించాలని ఆకాక్షించారు.  ఏప్రిల్‌ 19న సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రానికి సంగీతం మల్లిక్‌ ఎం.వి.కె, కెమెరా: మస్తాన్‌ సిరిపాటి, నిర్మాణ సహకారం: టి.గణపతిరావు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events