Namaste NRI

ఎన్నారై సుష్మితకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

అమెరికాలోని టెక్సాస్‌లో స్థిర‌ప‌డిన హైద‌రాబాద్ వాసి సుష్మితకు ప్ర‌తిష్టాత్మ‌క డాక్ట‌ర్ స‌రోజినీ నాయుడు అంత‌ర్జాతీయ అవార్డు ల‌భించింది. వ‌ర్కింగ్ ఉమెన్‌-2024 క్యాట‌గిరీలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. తెలంగాణ‌తోపాటు ద‌క్షిణ భార‌త దేశం నుంచి ఈ అవార్డు సొంతం చేసుకున్న సుస్మిత  నొయిడాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో అవార్డు అందుకున్నారు.  ఇంట‌ర్నేష‌న‌ల్ చాంబ‌ర్ ఆఫ్ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్ అండ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఉమెన్స్ ఫిల్మ్ ఫోర‌మ్ స‌హ‌కారంతో ఏఏఎఫ్‌టీ యూనివ‌ర్సిటీ ఈ అవార్డు ప్ర‌ధానం చేశారు.

దాతృత్వం, సామాజిక కార్య‌క‌ర్త‌, విద్యావేత్త‌, ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌గా సుష్మిత ఎంతో గుర్తింపు పొందారు. స‌మాజంలో కీల‌క భూమిక పోషించే మ‌హిళా సాధికార‌త‌కు ప్రోత్సాహం, బాల కార్మికుల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, బాల‌ల ప‌ట్ల వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా ఆమె అసాధార‌ణ రీతిలో ప‌ని చేశారు. ఆమె క‌రుణ‌, అంకిత భావంతో తాను ప‌ని చేయ‌డం వ‌ల్లే ఈ అవార్డు పొంద‌గ‌లిగారు. సుస్థిర ప్ర‌పంచంలో ఇత‌రుల‌కు భిన్నంగా జీవ‌నం సాగిస్తూ ముందుకెళ్ల‌డం వ‌ల్లే సుష్మిత‌కు ఈ అవార్డు ల‌భించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events