Skip to main content

Namaste NRI

ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం

ప్రధాని నరేంద్ర మోదీ కువైట్‌ అత్యున్నత గౌరవ పురస్కారం ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌ను అందుకున్నారు. విదేశాల అత్యున్నత నాయకులకు, రాజ కుటుంబాల సభ్యులకు స్నేహానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందిస్తారు.  రెండు రోజుల పర్యటన నిమిత్తం కువైట్‌ చేరుకున్న మోదీకి బేయన్‌ ప్యాలెస్‌లో సైనిక వందనం లభించింది. కువైట్‌ అమీర్‌(దేశాధినేత) షేక్‌ మెషల్‌ అల్‌-అహ్మద్‌ అల్‌-జబర్‌ అల్‌-సబహ్‌ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 43 ఏండ్లలో భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే ప్రథమం.

Social Share Spread Message

Latest News