ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. తొమ్మిదిరోజులపాటు వేడుక జరగనుంది. కరోనా మహమ్మారి విస్తరణ కారణంగా భక్తులను అనుమతించలేదు. వేదపండితులు, ఆలయ అర్చకులు, సిబ్బంది రథయాత్రను ఘనంగా నిర్వహించారు. జగద్గురు శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి పూరీ ఆలయానికి చేరుకున్నారు. ఆషాఢ శుక్ల విదియను పురస్కరించుకుని వేద పండితులు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మనిమా (జగన్నాథా) అంటూ నినాదాలు చేస్తూ ఉత్సవ మూర్తులను కదిలించడం ద్వారా రథయాత్రను ప్రారంభించారు.
నందిఘోష రథంపై జగన్నాథును ఉత్సవ విగ్రహాన్ని అధిష్టింపజేశారు. అనంతరం ఉత్సవమూర్తులైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులను ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేశారు. ఈ ఉత్సవాన్ని పహండీ అంటారు. ఆ తర్వాత గుండిచా ఆలయానికి వెళ్లేందుకు ఉత్సవ మూర్తులు రథంపై సిద్ధమైన ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌరవాభిమానాలను అందకునే పూరీ రాజ గజపతి మహారాజా పల్లకీలో అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన పరమాత్ముడి ముందు సేవకుడిగా మారి బంగారు చీపురుతో రథాలను ఊడ్చారు. ఈ తంతును చెరా పహారా అంటారు. ఆర్కియాలజీ విభాగం లేజర్ స్కానింగ్‌పై పర్యవేక్షించే బాధ్యతలు చేపట్టింది.