Namaste NRI

పుష్ప-2 బీభత్సం.. ఏడేళ్ల రికార్డ్ బ్రేక్

టాలీవుడ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్న మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో టాప్‌లో ఉంటుంది పుష్ప.. ది రూల్‌. స్టార్ డైరెక్టర్‌ సుకుమార్ డైరెక్షన్‌లో వస్తోన్న సీక్వెల్‌ పార్టులో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ మరోసారి పుష్పరాజ్‌గా సందడి చేయబోతున్నాడు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ లాంఛ్‌ నుంచి తరచుగా ఏదో ఒక అప్‌డేట్‌ లీక్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది బన్నీ టీం.

మూవీ లవర్స్‌ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నపుష్ప ది రూల్‌ టీజర్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌ టీం ఇటీవలే లాంఛ్ చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అంతే కాదు పుష్ప ది రూల్‌ టీజర్‌ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌ రికార్డు సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో 138 వాచింగ్‌ హవర్స్‌లో 110 మిలియన్‌ వ్యూస్‌, 1.55 మిలియన్‌ లైక్స్‌తో నంబర్ 1 స్థానంలో టాప్‌ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. జూనియర్‌ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాపై ఉన్న ఏడేళ్ల క్రితం నాటి రికార్డును పుష్ప ది రూల్ టీజర్‌ బ్రేక్ చేయడం విశేషం.

మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న పుష్ప ది రూల్‌ ఆగ‌స్టు 15న ప్రపంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోండగా, ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events