Skip to main content

Namaste NRI

రాజ్యసభ వేదికగా.. ప్రధాని మోదీ వ్యాఖ్యలు దురదృష్టకరం : అనిల్ కూర్మాచలం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై రాజ్యసభ వేదికగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎన్నారై టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్‌ కూర్మాచలం విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదనంటూనే ఎప్పటికప్పుడు ఆ అంశంపై విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని తెలగాణ ప్రజలంతా గమనిస్తున్నారనీ అన్నారు.  బీజేపీ, ఆ పార్టీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాటి నుంచి నేటి వరకూ తెలంగాణ ప్రజలను బీజేపీ మోసం చేస్తూనే ఉందని గుర్తు చేశారు.  రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే ముందు విభజన హామీలు నెరవేర్చాలని కోరారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని మోదీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.  లేదంటే గతంలో వంద నియోజకవర్గాల్లో డిపాజిట్‌ గల్లంతు చేసినట్టే రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో అదే భంగపాటు తప్పదని హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News