Skip to main content

Namaste NRI

హైతీలో భారత రాయబారిగా రాము అబ్బగాని

హైతీలో భారత రాయబారిగా రాము అబ్బగాని నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండకు చెందిన రాము ప్రస్తుతం డొమినికన్‌ రిపబ్లికన్‌లో భారత రాయబారిగా ఉన్నారు. హన్మకొండలోని మర్కాజీ ప్రభుత్వ హైస్కూల్‌లో పాఠశాల జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదివారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీవీ ఎంఎస్‌, ఎంవీఎంఎస్‌ చేసిన ఆయన జైపూర్‌లో నాబార్డు మేనేజర్‌గా విధులు నిర్వహించారు.  2001 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన రామును డొమినికన్‌ రిపబ్లికన్‌ రాయబారిగా గతేడాది నియమించారు. అంతకుముందు ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. 2001లో ఇండియన్‌ ఫారెస్టు సర్వీసెస్‌కు ఎంపికై జపాన్‌, థాయ్‌లాండ్‌లలోని భారత రాయబార కార్యాలయాల్లో పని చేశారు.

Social Share Spread Message

Latest News