Namaste NRI

తన అసిస్టెంట్‌ పెళ్లికి హాజరైన రష్మిక మందన్న

మంచితనానికి పరిమళమెక్కువంటారు. మనసు మంచిదైతే ఆ ప్రభావం మనిషిలో కూడా కనిపిస్తుంది. అందుకే అనుకుంట కథానాయిక రష్మిక మందన్న నేషనల్‌ క్రష్‌ అయ్యారు.  తన అసిస్టెంట్‌ పెళ్లికి హాజరై అక్కడున్న వారందరిని ఆశ్చర్యపరిచారు రష్మిక. ఆమె రాకతో పెళ్లికి విచ్చేసిన వారందరూ ఆనందంతో పొంగిపోయారు. రష్మిక మందన్న అసిస్టెంట్‌ సాయి వివా హం హైదరాబాద్‌లోని బహదూర్‌పల్లిలో జరిగింది. ఈ పెళ్లికి రష్మిక మందన్న హాజరై వధూవరులకు శుభాకాంక్షలందించారు. తన బిజీ షెడ్యూల్ లోనూ రష్మిక ఇలా తన అసిస్టెంట్ పెళ్లికి రావడం విశేషం. రష్మిక ప్రస్తుతం పుష్ప 2తోపాటు బాలీవుడ్ లో యానిమల్ మూవీలోనూ నటిస్తోంది. ఈ మధ్యే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్ నటిస్తున్న సినిమాలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ తో కలిసి రష్మిక నటిస్తున్న యానిమల్ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events