
హీరో రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబోలో ఓ సినిమా రూపొందుతోంది. ఇది రవితేజ హీరోగా నటిస్తున్న 76వ సినిమా. ఆర్‌టీ76 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. యూరప్‌లో కొత్త షెడ్యూల్ మొదలైంది. స్పెయిన్, జెనీవా, ఫ్రాన్స్‌లో దాదాపు 25రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుంది. ఇందులో కొంత టాకీ పార్ట్‌తో పాటు శేఖర్ మాస్టర్ నేతృత్వంలో రెండు పాటల్ని తెరకెక్కిస్తామని, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ కలబోసిన ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ఇదని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియా, రచన-దర్శకత్వం: కిషోర్ తిరుమల.
















