Skip to main content

Namaste NRI

రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ ప్రారంభం

రవితేజ కథానాయకుడిగా హరీశ్‌శంకర్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం మిస్టర్‌ బచ్చన్‌ హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక.   పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మిస్టర్‌ బచ్చన్‌ నామ్‌ తో సునా హోగా అని రవితేజ చెప్పిన డైలాగ్‌తో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. దీనికి కుమార్‌ మంగత్‌ పాఠక్‌ క్లాప్‌నివ్వగా, కే.రఘురామకృష్ణ, టీజీ భరత్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు. ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్‌ అభిమానిగా రవితేజ కనిపిస్తారని తెలిసింది.

రవితేజ స్వతహాగా బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమాని. ఈ నేపథ్యంలో సినిమాకు మిస్టర్‌ బచ్చన్‌ టైటిల్‌ పెట్టడం విశేషం. టైటిల్‌ పోస్టర్‌లో సైతం ఆయన అమితాబ్‌ పోజ్‌ను అనుకరిస్తూ కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్‌, సంగీతం: మిక్కీ జే మేయర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా, సమర్పణ: పనోరమా స్టూడియోస్‌, టీ-సిరీస్‌, సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌, రచన-దర్శకత్వం: హరీశ్‌ శంకర్‌.

Social Share Spread Message

Latest News