Namaste NRI

ఎన్‌ఆర్‌ఐలకు… ఆర్‌బీఐ తీపి కబురు

ఎన్నారైలకు ఆర్‌బీఐ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. విదేశాల్లో నివసిస్తూనే స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులకు ఇబ్బందులను తీర్చేందుకు మార్గం సుగమం చేస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగం రీత్యా విదేశాల్లో నివసిస్తున్న పిల్లలు ఇండియాలో నివసిస్తున్న తల్లిదండ్రులకు సంబంధించిన కరెంట్‌ బిల్లు, వాటర్‌ బిల్లు, తదితర బిల్లులను అక్కడి నుంచే చెల్లించే విధంగా భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌లో మార్పులు చేస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌  ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో ఎన్నారైలకు ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వెల్లడిరచారు.

                 ఇప్పటి వరకు పిల్లలను విదేశాలకు పంపిన వృద్ధులు బిల్లులు చెల్లించడానికి ఇతర వ్యక్తులపై ఆధారపడే వారు. శక్తికాంత్‌ దాస్‌ చెప్పినట్టుగా భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ లో మార్పులు చేసి, విదేశాల నుంచి ఎన్నారైలు బిల్లులు  చెల్లించే సౌకర్యం అందుబాటులోకి వస్తే వాళ్ల తల్లిదండ్రుల సమస్యలు చాలా వరకు తీరుతాయి. ఇప్పటి వరకు ఈ పేమెంట్‌ సిస్టమ్‌ భారత్‌లో మాత్రమే పని చేసేది. కానీ విదేశాల నుంచి కూడా వినియోగించే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News