తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం రాత్రి 9:12 గంటలకు విడుదలయ్యారు. కవిత జైలు నుంచి బయటకు రాగానే అక్కడే ఉన్న తన కొడుకును ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యా రు. ఆ తర్వాత భర్త అనిల్, అన్నయ్య కేటీఆర్‌ను గుండెలకు హత్తుకుని ఆనందభాష్పాలు రాల్చారు. ఈ సమయంలో హరీశ్‌రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు 165 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ సుప్రీం కోర్టు మంగళవారం కవితకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆమె బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించారు.
తీహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. పిడికిలి బిగించి జై తెలంగాణ నినాదాలు చేశారు ఆమె. భర్త అనిల్, అన్నయ్య కేటీఆర్, కుమారుడిని గుండెలకు హత్తుకుని కవిత భావోద్వే గానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చేశాను. తన పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైల్లో ఉండడం అనేది చాలా ఇబ్బంది కరమైన విషయం. ఇలాంటి ఇబ్బందులకు గురిచేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం. సమయం వస్తది, తప్పకుండా చెల్లిస్తాం. అదే విధంగా ఇలాంటి కష్టసమయంలో మాకు, మా కుటుంబానికి తోడుగా ఉన్నవారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని మంచిదాన్ని. నన్ను అనవసరం గా జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారు. ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా పని చేస్తాం. కమిట్‌మెంట్‌తో పని చేస్తాం. అందరితో కూడా నిలబడి ఉంటాం. మేం ఎవరికీ భయపడం న్యాయపరంగా పోరాడుతూనే ఉంటాం. నన్ను అనవసరంగా జైలుకు పంపారు అని కవిత పేర్కొన్నారు.