గృహ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో దేశంలోకి ఉపాధి కోసం భారీగా వస్తున్న విదేశీ వర్కర్ల విషయంలో కెనడా ప్రభుత్వం ఆంక్షలు విధించనున్నది. తొలిసారిగా తాత్కాలిక విదేశీ వర్కర్లను తగ్గించేందుకు నిర్ణయిం చింది. ఆంక్షలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయని అధికారులు చెప్పారు. తాత్కాలిక నివాసితుల సంఖ్య ను రానున్న 2-3 ఏండ్లలో ఐదు శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. విద్య, ఉపాధి నిమిత్తం విదేశ స్తులు భారీగా పోటెత్తుతున్న నేపథ్యంలో కెనడాలో గృహ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే.