Skip to main content

Namaste NRI

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లో .. రోహిత్ సరాఫ్ షెడ్యూల్ పూర్తి

బుల్లితెర ధారావాహికలతో పాటు పలు విజయవంతమైన చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఉత్తరాది యువతలో క్రేజ్‌ సంపాదించుకున్నారు రోహిత్‌ సరాఫ్‌. తాజాగా ఆయన డివోషనల్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ మహాకాళిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా కొల్లూరు దర్శకత్వం. ప్రశాంత్‌వర్మ నిర్మిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ నిర్మాణ దశలోనే ఆసక్తిని రేకెత్తిస్తున్నది. అక్షయ్‌ఖన్నా, భూమిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా భారతీయ ఆధ్యాత్మిక, పౌరాణిక మూలాలతో ముడిపడిన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. ఇందులో రోహిత్‌ సరాఫ్‌ పాల్గొంటున్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News