Namaste NRI

భారీ షెడ్యూల్‌కు సిద్ధమైన రౌడీ జనార్ధన

శ్రీకాకుళం నేపథ్యంతో కూడిన 80వ దశకపు పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా రౌడీ జనార్ధన. అగ్ర కథానాయకుడు విజయ్‌ దేవరకొండ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్‌ కథానాయిక. రవికిరణ్‌ కోలా దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌లో విజయ్‌ దేవరకొండ మేకోవర్‌, ఆయన సంభాషణలు పలికిన తీరు, అభిమానుల్నీ, సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్నది. ఈ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను కూడా పెంచింది. దిల్‌రాజు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మే చివరివారం హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సీలో ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ మొదలుకానున్నది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు ఓ పాటను కూడా చిత్రీకరిస్తారు. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ ఎపిసోడ్‌లో విజయ్‌ పూర్తి యాక్షన్‌ మోడ్‌లో కనిపిస్తారట. మునుపెన్నడూ లేనంతగా ఊరమాస్‌ పాత్రలో విజయ్‌ నటిస్తుండటంతో ఈ సినిమా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. షూటింగ్‌ పూర్తి చేసి, ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయనున్నారు.

Social Share Spread Message

Latest News