Namaste NRI

శ్రీశైలంలో వైభవంగా సహస్ర దీపార్చన

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన ప్రదోషకాలంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ దీపాలకంరణ సేవ నిర్వహించినట్లు ఈఓ లవన్న తెలిపారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాత దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి వేదపండితులచే మహాసంకల్పాన్ని పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించిన అర్చక వేదపండితులు దీపార్చన, పల్లకీ సేవను నిర్వహించారు.

Social Share Spread Message

Latest News