Skip to main content

Namaste NRI

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం… శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ సమావేశం

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇండియన్‌`శాన్‌ ఫ్రాన్సిస్కో కాన్సుల్‌ జనరల్‌ ఆధ్వర్యంలో  ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పర్యాటక, వాణిజ్య,  సాంకేతిక రంగాల్లో అవకాశాలను గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యంగా డయాస్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ అండ్‌ తెలంగాణ పేరుతో కాన్సుల్‌ జనరల్‌ ప్రత్యేకంగా ఇంటరాక్టివ్‌ సెషన్‌ నిర్వహించారు.  కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ నాగేంద్ర ప్రసాద్‌, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌తో సహా చాలా మంది ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. తెలుగు రాష్ట్రాలు వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు.  మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యాపార, పర్యాటక, సాంకేతిక రంగాల్లో అవసరమైన తోడ్పాటు అందించాలని నిర్ణయించారు. ఆయా రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు.  కార్యక్రమంలో తెలుగు సంతతికి చెందిన 50 మంది ప్రముఖ వక్తలు పాల్గొన్నారు.

          తెలుగు కమ్యూనిటీలో అందరికి సుపరిచితురాలైన  విజయ అసూరి ఈ సమావేశాన్ని ముందుండి నడిపించారు. ఈ సమావేశంలో డాక్టర్‌ నాగేంద్ర వరప్రసాద్‌, ఏపీ ప్రభుత్వ నార్త్‌ అమెరికా ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి, తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ చావా, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ బే ఏరియా ప్రతినిధి వెంకట రెడ్డి,  సిలికాన్‌ ఆంధ్ర యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ ఆనంద్‌ కూచిభోట్ల,  బే ఏరియా తెలుగు సంఘం సలహాబోర్డు ప్రతినిధి డాక్టర్‌ రమేష్‌ కొండా, కాకతీయ సౌండ్‌ బాక్స్‌ వ్యవస్థాపకుడు రాజురెడ్డి,  యాంకర్‌ వాలీ పార్ట్‌నర్స్‌ ప్రిన్సిపల్‌ సిద్దార్థ లక్కిరెడ్డి,  పసిఫిక్‌ ఏఏఐ ప్రాంతీయ డైరెక్టర్‌ సుజీత్‌ పున్నం, గ్లోబల్‌ అనలిస్ట్‌ వ్యవస్థాపకుడు రామ్‌ రెడ్డి, హైపై యూత్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు రాకృష్ణన్‌ సుందర్‌, ఫాల్కన్‌ఎక్స్‌ సహ వ్యవస్థాపకుడు బీవీ జగదీశ్‌  తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events