Skip to main content

Namaste NRI

భారత్‌లో కింగ్‌ చార్లెస్‌ దంపతుల సీక్రెట్‌ పర్యటన

బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ సీక్రెట్‌గా భారత్‌ పర్యటకు వచ్చినట్లు తెలిసింది. సతీమణి క్వీన్‌ కెమిల్లా తో కలిసి మూడు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూరు కు వచ్చినట్లు సమాచారం. అక్టోబర్‌ 27 నుంచి వారు బెంగళూరులోని ఓ వెల్‌నెస్‌ సెంటర్‌లో బస చేసిన్నట్లు  సమాచారం.  కింగ్‌ చార్లెస్‌ దంపతులు ఈ నెల 21 నుంచి 26 మధ్య కామన్వెల్త్‌ ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరైన తర్వాత సమోవా నుంచి నేరుగా భారత్‌కు సీక్రెట్‌గా వచ్చినట్లు  తెలిసింది. వారు బెంగళూరులోని ఓ వెల్‌నెస్‌ సెంటర్‌లో బస చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సెంటర్‌లో యోగా, ధ్యానం వంటి సెషన్స్‌తో సమయం గడుపుతున్నట్లు తెలిసింది. వెల్‌నెస్‌ సెంటర్‌ సిబ్బంది కింగ్‌ చార్లెస్‌, కెమిల్లాకు వివిధ రకాల థెరపీ చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సీక్రెట్‌ ట్రిప్‌ ముగించుకొని  వీరు బ్రిటన్‌ బయల్దేరనున్నట్లు తెలిసింది.

Social Share Spread Message

Latest News