Skip to main content

Namaste NRI

బాలయ్య వల్లే సెహరి స్థాయి పెరిగింది

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సెహరి. అద్వయ జిష్ణురెడ్డి నిర్మాత. ఈ నెల 11న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో  ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా హర్ష కనుమిల్లి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సమయంలో ఈ సినిమా పోస్టర్‌ను బాలకృష్ణ గారు లాంచ్‌ చేశారు. దాంతో ఈ సినిమా స్థాయి పెరిగింది. పాటలకు మంచి ఆదరణ లభిస్తున్నది అన్నారు. నేటితరం కథ ఇది. తొమ్మిది పాటలు, సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి అని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ఓటీటీలో మంచి ఆఫర్లొచ్చాయి. కానీ థియేటర్‌లో చూస్తే ఈ సినిమా  ఓ ఉత్సవంలా అనిపిస్తుంది. అందుకే థియేటర్‌ రిలీజ్‌కే మొగ్గుచూపాం అని తెలిపారు.  ఈ సినిమాలో నటుడిగా తనను సరికొత్త కోణంలో ఆవిష్కరించారని సంగీత దర్శకుడు కోటీ అన్నారు. తొమ్మిది పాటలు వేటికవే గొప్పగా అనిపిస్తాయని చిత్ర సంగీత దర్శకుడు ప్రశాంత్‌ విహారీ పేర్కొన్నారు.  అద్వయ జిష్ణు రెడ్డి, కెమెరామేన్‌ అరవింద్‌ విశ్వనాథ్‌, సంగీత దర్శకుడు ప్రశాంత్‌ విహారి, సిమ్రాన్‌ చౌదరి, ఎడిటర్‌ రవితేజ గిరిజాల, నటీనటులు అక్షిత, అనీష తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events