ఆది సాయికుమార్ కథానాయకుడుగా నటిస్తున్నచిత్రం షణ్ముఖ. అవికాగోర్ కథానాయిక. ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ఈ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. ఈ చిత్రం లో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే. పోలీస్‌డ్రెస్‌తో ఆది పవర్‌ఫుల్‌గా కనిపిస్తుం డగా, ఆయన వెనకాల షణ్ముఖ సుబ్రహ్మాణ స్వామి కనిపించడం, పోస్టర్ చూసిన అందరిలోనూ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి విడుదలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను ఇచ్చింది. ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.