Namaste NRI

విప్లవ వీరుడు మూవీ షూటింగ్ ప్రారంభం

ఇంద్రజ, జైశ్వర్‌, సోనాలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం విప్లవ వీరుడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎస్‌. నాగరాజ్‌ రావు దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్‌నిచ్చారు. స్వాతంత్య్ర కాలంనాటి ఈ కథలో ఓ సామాన్యుడు విప్లవ వీరుడిగా ఎలా మారాడనే వైనాన్ని చూపిస్తున్నామని, ఇదొక వీరోచితగాథ అని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో తాను రాణి భవానీ దేవి అనే పాత్రలో నటిస్తున్నానని ఇంద్రజ చెప్పారు. టిప్పు సల్తాన్‌ కాలంనాటి కథ ఇదని, మంచి సందేశంతో ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్‌, నిర్మాత: ఏవీ జయరాం, దర్శకత్వం: ఎస్‌.నాగరాజ్‌ రావు.


Social Share Spread Message

Latest News