విశ్వక్‌సేన్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం మెకానిక్ రాకీ. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు. ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడు. తాళ్లూరి రామ్ నిర్మాత. ఈ అంశాలన్నీ ఇందులో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్లలో ఒకరై శ్రద్ధా శ్రీనాథ్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. శ్రద్ధా శ్రీనాథ్ ఈ లుక్‌లో అల్ట్రా మోడ్రెన్‌గా అందమైన నవ్వుతో కనిపిస్తున్నది. నరేశ్, వైవా హర్ష, హర్షవర్థన్, రోడీస్ రఘురామ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ కాటసాని, సంగీతం: జేక్స్ బిజోయ్, నిర్మాణం: ఎస్సార్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్. చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. హైబడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారని, మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.