Namaste NRI

కెనడాలో భారత విద్యార్థుల పాట్లు

కెనడాలో ఒక స్టోర్‌ ముందు వందలాది మంది విద్యార్థులు బారులు తీరారు. వారంతా భారత్‌కు చెందిన విద్యార్థులే. పార్ట్‌ టైం ఉద్యోగం కోసం టొరంటోలో కాఫీ, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ అయిన టిమ్‌ హార్టన్స్‌ ఔట్‌లెట్‌ ముందు భారీగా బారులు తీరారు. ఈ దృశ్యం చూస్తే చాలు భారత్‌ విద్యార్థులు పార్ట్‌టైం ఉద్యోగం కోసం కెనడాలో ఎన్ని పాట్లు పడుతున్నారో అర్థం కావడానికి. ఉన్న ఒకటి, రెండు పార్ట్‌ టైం ఉద్యోగాల కోసం ఇంత మంది రావడం స్థానికులను కూడా ఆశ్చర్యపరిచింది.

ఇంత మందిని చూసి కంగారు పడిన ఆ ఔట్‌లెట్‌ నిర్వాహకులు విద్యార్థుల నుంచి రెజ్యూమ్‌లు తీసుకుని, తర్వాత ఇంటర్వ్యూకు పిలుస్తామని చెప్పి పంపేశారు. అసలే నిరుద్యోగ సమస్యతో అల్లాడుతున్న కెనడాలో మన విద్యార్థులకు పార్ట్‌ టైం ఉద్యోగం దొరకడం దుర్లభంగా మారింది. ఒక జాబ్‌ కోసం ఇంతమంది పోటీపడితే జాబ్‌ మార్కెట్‌ క్రాష్‌ కావడం ఖాయమని, అప్పుడు మీరు బీహార్‌లో కన్నా తక్కువ జీతానికి ఇక్కడ పనిచేయక తప్పదని ఒక నెటిజన్‌ వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]