Skip to main content

Namaste NRI

అట్లాంటాలో పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ : మహేశ్ బిగాల

అమెరికాలోని అట్లాంటాలో ఏర్పాటు చేయనున్న దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలాఖరున ఆవిష్కరించనున్నట్టు పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్‌ బిగాల వెల్లడిరచారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల వాయిదా వేసినట్టు తెలిపారు. అట్లాంటాలో జరిగిన సమావేశంలో మహేశ్‌ బిగాల మాట్లాడుతూ విగ్రహస్థాపనకు మూడు స్థలాలను పరిశీలించామని అన్నారు. వచ్చేవారం ఇండియా నుంచి విగ్రహాన్ని పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ప్రముఖులను, పీవీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

                అమెరికాలోని తెలుగు, ఇండియన్‌ డయాస్పోరా కాకుండా సెనెటర్‌, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ కుటుంబ సభ్యులు, మిగతా ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఏఐసీఏ ఫౌండిరగ్‌ మెంబర్‌ డాక్టర్‌ పాడిశర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కిషన్‌ తాళ్లపల్లి, వెంకట్‌ మీసాల, శ్రీధర్‌ కొంకల, నిరంజన్‌ పొద్దుటూరి, జనార్దన్‌ పన్నెల, ఇన్నయ్య ఎనుముల, రవి కల్లి, సాయిరాం కరమంచి, శివకుమార్‌ రామడుగు, గణేష్‌ కసమ్‌,  జయచంద్రారెడ్డి, సందీప్‌ గుండ్ల, వెంకట్‌ గడ్డం, శేఖర్‌ రెడ్డి పుట్టా, అజ్మీర్‌ ముస్తఫా, సాయిబాబా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News