స్పోర్ట్స్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్- అక్టోబర్ 5 నుంచి మొదలు కానుందని తెలిసిందే. ఈ సారి టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ బిగ్గెస్ట్ క్రికెట్ కార్నివాల్‌కు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. బీసీసీఐ దేశవ్యాప్తంగా కొంతమంది సెలబ్రిటీలను ఎంపిక చేసి, వారికి గోల్డెన్ టికెట్స్ అందిస్తుందని తెలిసిందే. వీటిలో ఓ గోల్డెన్ టికెట్‌ను తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అందుకున్నారు. బీసీసీఐ సెక్రటరీ జైషా తలైవాకు టికెట్ అందజేశారు. మరో పదిహేను రోజుల్లో స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోరుగా ఏర్పాట్లు చేస్తున్నది. సొంతగడ్డపై జరుగనున్న మెగాటోర్నీకి సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్‌ను విశిష్ట అతిథిగా ఎంపిక చేసింది. దీంతో పాటు టోర్నీలో ఏ మ్యాచ్‌కైనా వీక్షించే విధంగా తలైవాకు గోల్డెన్ టికెట్ కేటాయించింది.














