Skip to main content

Namaste NRI

సంధ్యా రాజు చూస్తున్నప్పుడు స్వర్ణకమలం గుర్తొచ్చింది : వెంకటేష్

డ్యాన్సర్‌ సంధ్యారాణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నాట్యం. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని పోనీ పోనీ పాటను విడుదల చేశారు వెంకటేశ్‌.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్యాన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు వచ్చి చాలా రోజులైంది. పోనీ పోనీ పాటను చూస్తుంటే విలక్షణ కథకు ఎమోషన్స్‌ కలగలిపినట్లుంది. నాకు నా స్వర్ణకమలం సినిమా గుర్తొచ్చింది.  చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు. స్వర్ణ కమలం సినిమా చాలాసార్లు చూశాను. ఎమోషనల్‌గా సాగే పోనీ పోనీ పాటను వెంకటేశ్‌గారు లాంచ్‌ చేయడంతో సంతోషంగా ఉంది అన్నారు సంధ్యరాణి. మా సినిమాకు స్వర్ణకమలం ఓ స్ఫూర్తి అన్నారు రేవంత్‌. ఈ చిత్రానికి సంగీతం : శ్రవణ్‌ భరద్వాజ్‌. రేవంత్‌ కోరుకొండ ఈ చిత్రానికి దర్శకుడు. నిశ్రింకళ ఫిల్మ్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 22న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News