
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు నోవైలో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే 24వ మహాసభలను పురస్కరించుకుని ఢల్లీిలో పలువురు కేంద్రమంత్రులను, ఎంపిలను స్వయంగా కలిసి మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రామ్మోహన్ నాయుడుతోపాటు ఎంపీలు కేశినేని చిన్ని, దగ్గుబాటి పురంధేశ్వరి, సిఎం. రమేశ్, లావు కృష్ణ దేవరాయ తదితరులను కలిశారు. మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. వారు కూడా తాము వస్తామని చెప్పినట్లు తానా నాయకులు పేర్కొన్నారు. తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, పాతూరి నాగభూషణం, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడి తదితరులు కేంద్రమంత్రులను, ఎంపిలను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు వివరించారు.


మరోవైపు కాన్ఫరెన్స్ కన్వీనర్ ఉదయ్‌కుమార్ చాపలమడుగు డెట్రాయిట్‌లో జరగనున్న తానా మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురితో సమావేశమవుతున్నారు.







