Skip to main content

Namaste NRI

వాషింగ్టన్ డీసీలో తెలంగాణ ఇంజినీర్ మృతి

అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు. కన్నకొడుకు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని భోరిగాం గ్రామానికి చెందిన ఏలేటి లక్ష్మారెడ్డి, శోభ దంపతుల చిన్న కుమారుడు నిహార్‌ రెడ్డి (31) మూడేళ్ల నుంచి అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంటున్నాడు. అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. గత ఆదివారం నిహార్‌ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. అయితే, ప్రమాదవశాత్తు నిహార్‌ రెడ్డి సమ్మమిష్‌ లేక్‌లో పడి గల్లంతయ్యాడు.

           నిహార్‌ రెడ్డి అతని అన్న నిఖిల్‌ రెడ్డి మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నిహార్‌ రెడ్డి రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ కు చెందిన యువతిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం భార్య కావ్య గర్భిణి. మూడు నెలల క్రితమే ఏలేటీ లక్ష్మారెడ్డి, శోభ దంపతులు అమెరికాలోని కొడుకుల వద్దకు వెళ్లారు. ఆదివారం సెలవుదినం కావడంతో కుటుంబ సమేతంగా జలపాత సందర్శనకు వెళ్లారు. అకస్మాత్తుగా కాలుజారి జలపాతంలో పడిపోవడంతో నిహార్‌ రెడ్డి మృతి చెందారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events